పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ గత నెల 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు చేశారు. స్థానిక ఎన్నికల విషయంలో 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళి విధించాలని సుప్రీంకోర్టు చెప్పింది కానీ.. గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో విధించాలని వేరుగా చెప్పలేదన్నారు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు ముందు నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదనడం సరికాదన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్ - AP Latest News
20:09 June 23
సుప్రీం తీర్పు వరుసగా నిర్వహించే స్థానిక ఎన్నికలకు వర్తిస్తుందని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపారు. జనసేన వ్యాజ్యం ఆధారంగా తీర్పు ఇచ్చారని.. అసలు జనసేన పిటిషన్‌లో 4 వారాల ముందు కోడ్ విధించాలన్న అంశమే లేదన్నారు. తీర్పు సందర్భంగా తనపైనా దురుద్దేశాలు ఆపాదించారని ఎస్‌ఈసీ నీలం సాహ్ని అన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని అప్పీల్లో అభ్యర్థించారు.
ఇదీ చదవండీ... Jagan Review: ఐటీ కేంద్రంగా విశాఖ: ముఖ్యమంత్రి