ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంపై హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. ఈ రోజు నలుగురు పిటీషనర్లు తమ వాదనలు పూర్తి చేశారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తరుపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి తన వాదనలు వినిపించారు. ఎస్ఈసీ తొలగింపు వ్యవహారంలో ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించింది. రాజ్యాంగంలోని 213 అధికరణ మేరకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారిని తొలగించాలంటే కారణాలు వివరించాలని... ప్రభుత్వం ఈ విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగానే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించిందని వాదించారు. నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఆమోదిస్తే రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతినే అవకాశం ఉందని మరో పిటీషనర్ తాండవ యోగేశ్ వాదించారు. నిమ్మగడ్డ తొలగింపును అంగీకరిస్తే ఇదే సాంప్రదాయంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ పదవీ కాలాన్ని తగ్గించే ప్రమాదంవుందన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని న్యాయస్థానాన్నికోరారు. మరికొందరు పిటీషనర్లు వాదనలు వినిపించాల్సి ఉండటంతో తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ఎస్ఈసీ పదవీ కాలం కుదింపుపై వాదనలు రేపటికి వాయిదా - నిమ్మగడ్డ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఎస్ఈసీ కుదింపుపై వాదనలు రేపటికి వాయిదా