పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పుర పోరుకు ఊతమిచ్చిందని....రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో అఖిలపక్షంతో సమీక్ష తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనలను...ఇక్కడా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటింటి ప్రచారంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని స్పష్టం చేశారు.
ఏయూ వీసీపై విచారణకు ఆదేశం
ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి...వైకాపా కుల సంఘాల సమావేశంలో పాల్గొన్నట్లు ఫిర్యాదు అందిందని నిమ్మగడ్డ చెప్పారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. వాస్తవమని తేలితే ఉపేక్షించేది లేదన్నారు.పంచాయతీ ఎన్నికల్లో విద్యుత్ సరఫరా తొలగించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై...నివేదికలు పరిశీలిస్తున్నట్లు రమేశ్ కుమార్ చెప్పారు.
ఇదీ చదవండి:
నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ: ఎస్ఈసీ