ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎస్​ నీలం సాహ్నికి.. ఎస్​ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ - ఆంధ్రప్రదేశ్​లో తాజా రాజకీయాలు

sec-nimmagadda
sec-nimmagadda

By

Published : Nov 19, 2020, 10:22 AM IST

Updated : Nov 19, 2020, 10:58 AM IST

10:20 November 19

ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంపై కొనసాగుతోన్న సందిగ్ధత

రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ మరింత ముదురుతోంది. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు కోసం ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో.. ఇవాళ మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ.. ఆ సమావేశానికి అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్​ను కోరారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. అందుకు తగ్గట్లు తన కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్లకు ..ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

ఇదీ చదవండి: 

రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య 'పంచాయతీ' పోరు

Last Updated : Nov 19, 2020, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details