గవర్నర్, తనకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు.. కీలకమైన సమాచారం బయటకు పొక్కడంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్‌కు తాను రాసిన ఉత్తరప్రత్యుత్తరాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయని.. రాజ్‌భవన్ నుంచి బయటకు రావడంపై దర్యాప్తు చేయించాలని నిమ్మగడ్డ కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శితోపాటు.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణను పిటిషన్‌లో చేర్చారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు వేరే బెంచ్‌కు బదిలీ చేసింది.
ఎస్ఈసీ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ చేసిన హైకోర్టు - హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఏపీ విశ్వభూషణ్ హరిచందన్, తన మధ్య జరిగిన సంభాషణలు లీక్ చేయడంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ వ్యాజ్యాన్ని వేరే బెంచ్‌కు హైకోర్టు బదిలీ చేసింది.
sec-nimmagadda
Last Updated : Mar 20, 2021, 12:16 PM IST
TAGGED:
sec taza