చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదిక..సీఎస్‌కు లేఖలో ఎస్ఈసీ - ap local polls 2020
14:55 January 23
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ
వీడియో కాన్ఫరెన్స్ ను వాయిదా వేయాలంటూ సీఎస్ అదిత్య నాథ్ దాస్ చేసిన విజ్ఞప్తిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరస్కరించారు. ఈ అంశంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయ్యిందని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించటానికి వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదిక అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయగలమని లేఖలో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో హాజరుకావాలని మరోమారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి