మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు(AP SEC Neelam Sahni on Elections news). ఎక్కడా రీ-పోలింగ్ చేయాలని వినతులు రాలేదన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని సాహ్ని వివరించారు.
"ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కుప్పం మున్సిపాలిటీలో కొన్ని ఘటనలు జరిగాయి. ఎక్కడా రీ-పోలింగ్ చేయాలనే వినతులు రాలేదు. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 72.19 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 49.89 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచాం. రేపు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది" అని నీలం సాహ్ని తెలిపారు.