ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ఆరోపణలు ఆశ్చర్యం కలిగించాయి: నిమ్మగడ్డ - ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 11 రాజకీయ పార్టీలు హాజరై తమ అభిప్రాయాలను తెలుపగా..వైకాపా హాజరుకావట్లేదని తెలిపిందని నిమ్మగడ్డ తెలిపారు. ఎస్‌ఈసీపై వైకాపా నాయకుడి ప్రెస్‌నోట్ చూసి కమిషన్ ఆశ్చర్యపోయిందన్నారు.

nimmagadda
nimmagadda

By

Published : Oct 28, 2020, 3:17 PM IST

Updated : Oct 28, 2020, 6:25 PM IST

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడంపై వైకాపా చేసిన ఆరోపణలు ఆశ్చర్యం కలిగించాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్న ఆయన... ఈనెల 27న వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అధికారులతో గంటపాటు చర్చించామన్నారు. రాష్ట్రంలో కొవిడ్ విస్తృతి, తీసుకుంటోన్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నామన్నారు.

ఎన్నికల నిర్వహణ వంటి కీలక చర్యలు తీసుకునే ముందు సంప్రదింపుల ప్రక్రియను గొప్ప అంశంగా కమిషన్ భావిస్తుందని నిమ్మగడ్డ తెలిపారు. సీఈసీ ఉత్తమ పద్ధతులనే ఎస్​ఈసీ అనుసరిస్తుందన్న స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. గుర్తింపు పొందిన 19 రాజకీయ పార్టీలను ఆహ్వానించగా 11 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయం తెలిపారన్నారు. జనసేన, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు ఈ-మెయిల్ లేఖ ద్వారా అభిప్రాయాలు తెలియజేశాయని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వివరించారు.

Last Updated : Oct 28, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details