ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మిగిలిన విడతలను పారదర్శకంగా నిర్వహిద్దాం..: ఎస్​ఈసీ ఆదేశం - ఏపీ పంచాయతీ ఎన్నికలు

సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశమయ్యారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. రెండు, మూడు, నాలుగో దఫా ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

sec-meeting
sec-meeting

By

Published : Feb 11, 2021, 11:16 AM IST

Updated : Feb 11, 2021, 12:59 PM IST

తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిపినందుకు.. సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అభినందనలు తెలిపారు. ఎస్​ఈసీ కార్యాలయానికి వచ్చిన సీఎస్‌, డీజీపీతో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ సమావేశమయ్యారు. అర గంటకుపైగా జరిగిన సమావేశంలో.. రెండు, మూడు, నాలుగో దఫా ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లు,భద్రతా అంశాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్నిచర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఎల్లుండి జరిగే రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం.. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Last Updated : Feb 11, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details