కుల ధ్రువపత్రాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరింత స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఉన్న కుల ధ్రువపత్రాలను సైతం స్వీకరించాలని అధికారులకు సూచించారు. తాజాగా జారీ చేసిన పత్రాలే కావాలంటూ పట్టుబట్టవద్దని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
'కుల ధ్రువపత్రాలు కొత్తవే కావాలంటూ పట్టుబట్టొద్దు'... అధికారులకు ఎస్ఈసీ ఆదేశం - panchayat elections 2021 in ap
SEC nimmagadda ramesh
Last Updated : Jan 30, 2021, 3:49 PM IST