నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. 161 మండలాల్లోని 3,299 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. 553 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 2,744 గ్రామాల్లో ఈ నెల 21న ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పింది. 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు పేర్కొంది. 33,435 వార్డులకుగాను 10,921 ఏకగ్రీవమైనట్లు ప్రకటించింది. మిగిలిన 22,422 వార్డులకు ఈ నెల 21న ఓటింగ్ జరగనుండగా.. 49,089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించింది.
నాలుగో విడత పల్లెపోరులో 553 పంచాయతీలు ఏకగ్రీవం - నాలుగో విడత పల్లెపోరులో ఏకగ్రీవాలు
ఈనెల 21న జరగనున్న నాలుగో విడత పల్లెపోరులో 3,299 సర్పంచి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. 553 సర్పంచి, 10,921 వార్డు అభ్యర్థుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వెల్లడించింది. 7,475 మంది సర్పంచిగా, 49,089 మంది వార్డు అభ్యర్థులుగా పోటీలో ఉన్నట్లు తెలిపింది.
![నాలుగో విడత పల్లెపోరులో 553 పంచాయతీలు ఏకగ్రీవం sec announced fourth phase panchayati elections details](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10666573-36-10666573-1613570356868.jpg)
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించిన ఎస్ఈసీ