ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు - ఎస్ఈసీ న్యూస్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఎస్​ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసంది. ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేసింది.

sec
ఎస్​ఈసీ

By

Published : Mar 3, 2021, 12:20 PM IST

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణలపై కొన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయనీ.. బలవంతపు ఉపసంహరణలకు అంగీకరించవద్దని ఎస్​ఈసీ స్పష్టం చేసింది.

ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దనీ.. ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. మూడో పక్షం నుంచి ఉపసంహరణలను అంగీకరించవద్దని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కలెక్టరు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details