ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యాక్సినేషన్​లో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రభుత్వానికి ఎస్​ఈసీ ఆదేశం - ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వార్తలు

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఉద్యోగులకు ఎస్‌ఈసీ పలు సూచనలు చేసింది. ఉద్యోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.

SEC alerts
SEC alerts

By

Published : Jan 9, 2021, 12:15 PM IST

శుక్రవారం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగుల రక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా శానిటైజర్, మాస్క్‌లు సరఫరా చేయాలని కమిషన్‌ తెలిపింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తోపాటు సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలంది. వ్యాక్సినేషన్‌లో సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి నిర్దేశించింది.

ABOUT THE AUTHOR

...view details