రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టుషాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తోన్న 345 ప్రాంతాలను ఎస్ఈబీ గుర్తించింది. శానిటైజర్లు తాగుతున్న 144 మందిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చింది.
శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్స్‌లను అధికారులు పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లు తయారుచేస్తోన్న 76 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 3,936 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.