ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల విస్తృత సోదాలు - seb officers rides latest news

రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎస్​ఈబీ అధికారులు.. నాటుసారా స్థావరాలు, కర్ణాటక మద్యం రవాణా, ఇసుక తరలింపు వంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరికైనా అక్రమాలు జరుగుతన్నాయని తెలిస్తే వెంటనే తెలియజేయవలసిందిగా కోరారు.

seb officers rides on state wide and caught karnataka liquor, sand, cheap liquor packets
ఉరవకొండలో 29 మద్యం సీసాలు స్వాధీనం

By

Published : Jun 21, 2020, 6:40 AM IST

అనంతపురం జిల్లా

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఉరవకొండ ఎస్​ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్ పరిసర ప్రాంతాల్లో 29 కర్ణాటక సీసాలను రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న ముగ్గరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నట్లు సిఐ శ్యాంప్రసాద్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కడప జిల్లా

రైల్వేకోడూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారి శివసాగర్ ఆధ్వర్యంలో దాడులు చేస్తున్నారు. శనివారం చలంపాలెం, యానాది కాలనీ సమీపంలో దాచి ఉంచిన 380 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అధికారి తెలిపారు.

విజయనగరం జిల్లా

జిల్లాలోని నెల్లిమర్ల, ఎల్​. కోట, గంట్యాడ, బూర్జి వలస, మక్కువ రూరల్, విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ, ఇసుక ట్రాక్టర్, 330 నాటు సారా ప్యాకెట్లు, 20 లీటర్ల నాటుసారా, 42 చిన్న మద్యం బాటిళ్లు, రెండున్నర కిలోల గంజాయి పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఈబీ అదనపు ఎస్పీ కుమారి శ్రీదేవి రావు తెలిపారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో స్థానిక పోలీసులు, ఎస్ఈబి సిబ్బంది దాడులు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

ఇదీ చదవండి:

మద్యం అక్రమ అమ్మకాలు.. ప్రభుత్వ మద్యం దుకాణ ఉద్యోగి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details