ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 5:43 PM IST

Updated : Mar 1, 2021, 6:24 PM IST

ETV Bharat / city

తెలంగాణ: లాయర్​ దంపతుల హత్య కేసులో కత్తులు లభ్యం

తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతి బ్యారేజీలో 53వ నంబర్​ పిల్లర్ వద్ద రెండు కత్తులను పోలీసులు గుర్తించారు.

లాయర్​ దంపతులను హతమార్చిన రెండు కత్తులు లభ్యం
లాయర్​ దంపతులను హతమార్చిన రెండు కత్తులు లభ్యం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలో న్యాయవాద దంపతుల హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. సుందిళ్ల బ్యారేజీలోని 53వ పిల్లర్ వద్ద రెండు కత్తులు దొరికాయి. వామన్ రావు, నాగమణిని హతమార్చేందుకు ఉపయోగించిన కొడవళ్లను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు కస్టడీలో తెలిపారు.

పార్వతి బ్యారేజీలో 53వ నంబర్‌ పిల్లర్‌ వద్ద కత్తి లభ్యం

ఈ మేరకు పోలీసులు రెండో రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏపీ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు... సుందిళ్ల బ్యారేజీలో 25 ఫీట్ల లోతులోకి వెళ్లి కొడవళ్ల కోసం వెతికారు. ఆదివారం ఆయుధాలు దొరకకపోవటంతో ఇవాళ కూడా గాలింపు కొనసాగింది. నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చి... మరింత సమాచారం సేకరించారు. 48వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్ మధ్యలో ఆయుధాలు పడేసినట్లు నిందితులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు అయస్కాంతాలు, డ్రోన్ కెమెరాలు, బోట్ల సహాయంతో గాలించారు. 53వ పిల్లర్ వద్ద రెండు కత్తులు కొద్దిపాటి దూరంలోనే లభించాయి. హత్య జరిగిన 13 రోజుల తర్వాత రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు.

తెలంగాణ: లాయర్​ దంపతుల హత్య కేసులో కత్తులు లభ్యం

ఇదీ చూడండి:

'నన్ను అడ్డుకోలేరు... నేను తగ్గేది లేదు'

Last Updated : Mar 1, 2021, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details