ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ.. 3 రోజులైనా కానరాని పెద్దపులి జాడ

తెలంగాణలోని కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో పెద్దపులి కోసం వేట కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ఓ పశువుల కాపారిని హతమార్చిన పులిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి అధికారులు గాలిస్తోన్నా... పెద్దపులి జాడ మాత్రం తెలియరావటం లేదు.

3 రోజులైనా కానరాని పెద్దపులి జాడ
3 రోజులైనా కానరాని పెద్దపులి జాడ

By

Published : Nov 14, 2020, 5:25 PM IST

తెలంగాణలోని కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో 3 రోజుల క్రితం మనిషిని హతమార్చిన పులిని బంధించేందుకు చేపట్టిన చర్యలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా 50 మంది అటవీ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నప్పటికీ పులి జాడ కనిపించలేదు. అటవీప్రాంతంలో 5 బోన్లను ఏర్పాటు చేసి.. నిత్యం 50 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. పులి దాడి చేసిన పరిసర ప్రాంతంలో 30 కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.

పెద్దపులి అడుగు'జాడ'ల్లో...

ఈరోజు ఉదయం అటవీప్రాంతంలోకి వెళ్లిన సిబ్బందికి పెంచికలపేట అటవీప్రాంతంలో పులి అడుగులు కనిపించినట్లు రెబ్బెన రేంజి అధికారిణి పూర్ణిమ తెలిపారు. ఆ అడుగు జాడలను బట్టి పులి మహారాష్ట్ర వైపు పయనిస్తున్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. మరొక పది రోజుల గడిస్తేగానీ కచ్చితంగా చెప్పలేమని పూర్ణిమ అభిప్రాయపడ్డారు. మనిషిపై దాడి చేసిన పులి మహారాష్ట్ర నుంచి వచ్చినదే కాబట్టి... మళ్లీ అటువైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనావేస్తున్నారు. ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయపర్చుకుంటూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

విధుల్లోనే సిబ్బంది విందు...
పులి జాడ కోసం వేచిచూస్తూ...

మరోవైపు బెజ్జురు మండలంలో గత మూడు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. సమీప గ్రామాల్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే... పులి సంచారం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆదరించిన కుటుంబం కోసం ప్రాణాలొడ్డిన శునకం

ABOUT THE AUTHOR

...view details