ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CCMB: కరోనా వ్యాప్తిలో డీఎన్‌ఏ పాత్రపై శాస్త్రవేత్తల పరిశోధన - telangana news

కరోనా వ్యాప్తికి జెనెటికల్ మార్పులతో పాటు జీవన విధానం, రోగ నిరోధకశక్తి వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్ తీవ్రతకు కారణమైన డీఎన్​ఏ... సౌత్ ఏషియన్‌లో పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపారు.

CCMB
CCMB

By

Published : Jun 12, 2021, 8:50 AM IST

కొవిడ్‌ వ్యాప్తికి జెనెటికల్ మార్పులతో పాటు జీవన విధానం, రోగ నిరోధకశక్తి వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్‌ కొందరిలో తీవ్ర ప్రభావం చూపడానికి మరి కొందరిలో కనీసం లక్షణాలు లేకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు.

కరోనా వ్యాప్తిలో డీఎన్​ఏ పాత్రపై.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సౌత్ ఏషియన్‌లో పరిశోధన చేశారు. యూరోపియన్‌లలో వైరస్ తీవ్రతకు కారణమైన డీఎన్​ఏ... సౌత్ ఏషియన్‌లో పెద్దగా ప్రభావం చూపలేదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు.

యూరోపియన్‌లలో వైరస్ తీవ్రతకు కారణమైన డీఎన్​ఏ అక్కడ వారిలో 16 శాతం ఉండగా సౌత్ ఏషియన్లలో ఏకంగా 50 శాతం ఉన్నట్టు గుర్తించారు. ఇందుకోసం భారత్, బంగ్లాదేశ్‌లలో వైరస్‌ శాంపిల్‌లను సేకరించారు. యూరోపియన్‌లలో ప్రభావం చూపిన డీఎన్​ఏ సౌత్ ఏషియన్‌లలో తక్కువ ప్రభావం చూపుతున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి:

పెరుగుతున్న ధరలు.. ఆదాయం లేక కుంగుతున్న పేదలు!

ABOUT THE AUTHOR

...view details