ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగస్టు 3న పాఠశాలలు పునఃప్రారంభం - ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం

రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. స్పందనలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జులై 31లోగా పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇసుక, మద్యం అక్రమాలకు చెక్‌ పెట్టాలని ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

schools-starts-from-agust-3
ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం

By

Published : May 19, 2020, 4:36 PM IST

Updated : May 20, 2020, 12:50 PM IST

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాఠశాలల్లో నాడు-నేడు , వేసవిలో తాగునీరు, ఇళ్లపట్టాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణా తదితర అంశాలపై చర్చించారు. ఆగస్టు 3న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతాయని సీఎం ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందని..వీటి కోసం రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్ష చేయాలని సీఎం సూచించారు.

ప్లాట్లను సిద్ధం చేయాలి..

రాష్ట్రంలో పేదలకు ఇవ్వనున్న ఇళ్ల పట్టాలపై సమీక్షించిన సీఎం ఆదేశాలు జారీ చేశారు. మే 31లోగా భూ సేకరణ, ప్లాట్లను సిద్ధం చేయడం తదితర అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఇల్లులేని నిరుపేద ఉండకూడదని ... అర్హత ఉండీ ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదన్నారు. ఎవరైనా మిగిలిపోతే వారి నుంచి మే 21 వరకూ దరఖాస్తులు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని ఆదేశించారు. మే 30 కల్లా వెరిఫికేషన్‌ పూర్తిచేసి .. తుది జాబితా జూన్‌ 7న ప్రకటించాలని సూచించారు.

ఇసుక, మద్యం అక్రమాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. మద్యం అక్రమాల నివారణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలీసు విభాగానికి బాధ్యతలను అప్పగించి.. యువ ఐపీఎస్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాలని తప్పనిసరిగా నిల్వలు పెంచాలని సీఎం సూచించారు.

ఇదీ చదవండి:డాక్టర్ సుధాకర్​ను కోర్టు ఎదుట హాజరుపరచండి: హైకోర్టు

Last Updated : May 20, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details