కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్రలో మూతపడిన పాఠశాలలు రేపటి నుంచి తిరిగి తెరచుకోనున్నాయి. సోమవారం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు కొవిడ్ ప్రొటోకాల్స్‌కు కట్టుబడి ఉండేలా చర్యలు చేపడతామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.
schools reopen: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే స్కూల్స్ రీఓపెన్ - schools reopen: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే స్కూల్స్ రీఓపెన్
మహారాష్ట్రలో మూతపడిన పాఠశాలలు రేపటి నుంచి తిరిగి తెరచుకోనున్నాయి. సోమవారం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు.
schools reopen
అయితే పాఠశాలల పునః ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారు.