schools reopen: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..!
13:28 July 07
విద్యాశాఖలో నాడు- నేడుపై సీఎం సమీక్ష
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాల(schools reopen)ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని.. తద్వారా ఏ స్కూల్ మూతపడదని స్పష్టం చేశారు. నూతన విద్యావిధానం అమలుతో ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని మంత్రి సురేశ్ తెలిపారు. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదుల నిర్మించనున్నట్లు వెల్లడించారు. నాడు- నేడు కింద పనులకు రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈనెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పదో తరగతిలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజిగా తీసుకుని ఆ ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామని అన్నారు..
ఇదీ చదవండి: