ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు బంద్

కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లను తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్‌లాక్‌ 2.0 గడువు ఈనెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌ 3.0 నిబంధనలను బుధవారం రాత్రి విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరమే ఆ మార్పులు చేసినట్టు తెలిపింది.

schools band
schools band

By

Published : Jul 30, 2020, 4:50 AM IST

Updated : Jul 30, 2020, 5:07 AM IST

* సినిమాహాళ్లు, ఈతకొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు, జనం గుమికూడటానికి వీలున్న ఇతర ప్రాంతాలు ఆగస్టు 31 వరకు తెరవడానికి వీల్లేదు.

* వందేభారత్‌ మిషన్‌ కింద మాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పరిమితంగా అనుమతిస్తారు. మెట్రో రైళ్లు కూడా నడవవు.

* సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం యథాతథంగా ఉంటుంది.

* వచ్చే నెల 5 నుంచి యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు మాత్రం తెరవొచ్చు. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ జారీ చేసే ప్రామాణిక నిబంధనల ప్రకారం వీటిని నిర్వహించాల్సి ఉంటుంది.

* స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భౌతికదూరం పాటించాలి. మాస్క్‌ ధరించాలి.

* ఆగస్టు 31 వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ఉంటుంది. ఇందులో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన వాటిని అనుమతించకూడదు. ఇక్కడ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇంటింటి సర్వే చేపట్టాలి.

* కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల కార్యకలాపాలపై అవసరం అనుకుంటే రాష్ట్రాలు తగిన పరిమితులు విధించవచ్చు.

* రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరకు రవాణాకు ఎలాంటి పరిమితులు లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా అనుమతులు, మంజూరులు, ఇ-పర్మిట్‌లు అవసరం లేదు.
* పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదన్న నిబంధన అలాగే కొనసాగుతుంది.

* మార్చి 25 నుంచి దేశంలో అమలవుతున్న రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తేశారు.

* మిగిలిన అంశాల్లో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు, వెసులుబాట్లు యథాతథంగా కొనసాగుతాయి.

ఇదీ చదవండి:అన్​లాక్​ 3.0: సినిమా హాళ్లకు నో- యోగా కేంద్రాలకు ఓకే

Last Updated : Jul 30, 2020, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details