ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీఎల్‌ఈడీ కళాశాలల్లో తనిఖీలు - ఉపాధ్యాయ విద్య వార్తలు

డీఎల్‌ఈడీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ తనిఖీలు చేపట్టింది.

DLED CHECKINGS
డీఎల్‌ఈడీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు కృషి

By

Published : Dec 16, 2020, 1:58 PM IST


ప్రాథమిక విద్య డిప్లమా(డీఎల్‌ఈడీ) కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 354 కళాశాలల పత్రాల పరిశీలనకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల వ్యవధిలో డాక్యుమెంట్ల పరిశీలన పూర్తి చేయనున్నారు. ప్రవేశాల రిజిస్టర్లు, ప్రారంభ అనుమతులు, కన్వీనర్, యాజమాన్య, స్పాట్‌ సీట్ల భర్తీ, గత మూడేళ్ల ఆదాయ-వ్యయాలు, సిబ్బంది నియామకాలు, వారి జీతభత్యాలను పరిశీలించనుంది. నోటీసుల కారణంగా కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. తనిఖీలకు హాజరుకాని కళాశాలలకు మళ్లీ నోటీసులు పంపించనున్నారు. రికార్డుల తనిఖీల అనంతరం కళాశాలలను పరిశీలించి ఉపాధ్యాయ విద్యను ప్రక్షాళన చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details