రాష్ట్రవ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు - school education committee elections
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా నల్లవల్లిలో విద్యా కమిటీ ఛైర్మన్ ఎంపికలో వివాదం చోటుచేసుకుంది. కడప, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
విద్యా కమిటీల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రశాంతంగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతంగా ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని నల్లవల్లిలో... విద్యాకమిటీ ఛైర్మన్ ఎంపికలో వివాదం చోటుచేసుకుంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు బాహాబాహీకి దిగారు. వైకాపా నాయకులు నగదు పంపిణీ చేశారంటూ... తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. మరోవైపు.. కడప జిల్లా చక్రాయపేట, ప్రకాశం జిల్లా చీరాల, తూర్పు గోదావరి జిల్లాల్లో.... ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాలలో ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో... ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉండేలా ఎన్నిక నిర్వహించారు. కృష్ణాజిల్లా నందిగామలో... అధికార పార్టీనుంచే రెండు, మూడు వర్గాలు బరిలో దిగాయి. సమస్యత్మాక గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.