ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణను బహిరంగంగా అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని... అఖిల భారత కుల అసమానతా నిర్మూలన పోరాట సమితి డిమాండ్ చేసింది. న్యాయమూర్తి రామకృష్ణ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరింది. జడ్జిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి జూనియర్ సివిల్ జడ్జి బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అనే అంశపై రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
'మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి' - judge ramakrishna latest news
జడ్జి రామకృష్ణను బహిరంగంగా అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అఖిల భారత కుల అసమానతా నిర్మూలన పోరాట సమితి డిమాండ్ చేసింది. అలాగే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరింది.
judge ramakrishna