ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DAMMALAPATI: దమ్మాలపాటి వ్యవహారంలో.. సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌ ఉపసంహరణ - ఏపీ తాజా వార్తలు

దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో సుప్రీంలో పిటిషన్​ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై గతంలో సుప్రీంను ప్రభుత్వం ఆశ్రయించింది. 4 వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు.. సుప్రీం ధర్మాసనం సూచించింది.

DAMMALAPATI
DAMMALAPATI

By

Published : Jul 22, 2021, 12:27 PM IST

దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో సుప్రీంలో పిటిషన్‌ను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై గతంలో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. 4 వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.

అమరావతి భూముల వ్యవహారంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు, అమరావతి భూముల వ్యవహారంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన బంధువుల ద్వారా కృష్ణా జిల్లాలో భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది.

ఈ క్రమంలో దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం విచారణపై స్టే ఇచ్చింది. అంతేకాక, దానికి సంబంధించిన వివరాలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇప్పుడీ స్టే పైనే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం..4 వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో సుప్రీంలో పిటిషన్‌ను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల్లో కుండపోత.. జలాశయాలకు భారీగా వరద

ABOUT THE AUTHOR

...view details