ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎస్బీఐ రూ. 17 లక్షల ఆర్థిక సాయం

SBI Donation to Ex Soldiers Welfare: మాజీ సైనికుల సంక్షేమం కోసం గత ఆరేళ్లుగా ఎస్బీఐ తన వంతు సాయం అందిస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా.. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల నుంచి విరాళాలను సేకరించింది. మొత్తంగా రూ. 17 లక్షల విలువైన చెక్కును తెలంగాణ రాజ్​భవన్​లో గవర్నర్​కు ఎస్బీఐ అధికారులు​ అందించారు.

మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎస్బీఐ రూ. 17 లక్షల ఆర్థిక సాయం
మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎస్బీఐ రూ. 17 లక్షల ఆర్థిక సాయం

By

Published : Mar 16, 2022, 5:32 PM IST

మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎస్బీఐ రూ. 17 లక్షల ఆర్థిక సాయం

SBI Donation to Ex Soldiers Welfare: మాజీ సైనికుల సంక్షేమం కోసం రూ. 17 లక్షల చెక్కును తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు ఎస్బీఐ అధికారులు అందజేశారు. 2016 నుంచి ఏటా సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ.. ఆర్థిక సహయాన్ని అందిస్తోందని ఏజీఎం రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది కూడా ఉద్యోగులు, అధికారుల నుంచి సేకరించిన రూ. 17 లక్షల 12 వేల 200ను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి గవర్నర్‌ ద్వారా అందించినట్లు వివరించారు.

ఈ మొత్తాన్ని మాజీ సైనికులపై ఆధారపడిన ఆడపిల్లలు, వితంతువుల సంక్షేమానికి ఉపయోగిస్తారని ఎస్బీఐ సీజీఎం అమిత్​ జంగ్రాన్‌ తెలిపారు. మహిళల సామాజిక, ఆర్థిక స్థిరత్వం కోసం తమ బ్యాంకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details