ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

power cut on panchayats సర్పంచుల మెడపై కత్తి

కేంద్రం కేటాయించే ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసినా వీటిలో చాలావరకూ విద్యుత్తు బకాయిల కింద వెళ్లిపోతాయని సర్పంచులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల నుంచి ఇంకా రూ.3,500 కోట్లకు పైగా బకాయిలు రావాలని విద్యుత్తు పంపిణీ సంస్థలు చెబుతున్నాయి.

power cut on panchayats
సర్పంచుల మెడపై కత్తి

By

Published : Aug 18, 2022, 8:30 AM IST

రాష్ట్రప్రభుత్వం గత ఏడాది పంచాయతీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు పంపిణీ సంస్థలకు మళ్లించింది. ఇప్పుడూ విద్యుత్తు సరఫరా నిలిపివేయడం ద్వారా సర్పంచులపై ఒత్తిడి పెంచి.. త్వరలో జమయ్యే ఆర్థిక సంఘం నిధులను చెల్లించేలా పంపిణీ సంస్థలు ప్రత్యక్ష చర్యలకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఖాతాలు మళ్లీ ఖాళీ అవుతాయని స్పష్టమవుతోంది.

ఏడాది క్రితం:ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా రూ.1,244 కోట్లు మళ్లించి విద్యుత్తు పంపిణీ సంస్థలకు సర్దుబాటు చేసింది. పన్నుల ఆదాయం అంతంతమాత్రంగా ఉండే పంచాయతీలకు ప్రధాన ఆధారమైన ఆర్థిక సంఘం నిధుల ఖాతాలు ఖాళీ అవ్వడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి నుంచి చాలా పంచాయతీలు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి.

ఇప్పుడు:గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి 2021-22 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం రూ.379 కోట్లు కేటాయించింది. వీటిలో 70% నిధులు పంచాయతీలకు జమవుతాయి. వీటి కోసం ఏడాదిగా సర్పంచులు ఎదురుచూస్తున్నారు. వీటి విషయం తెలిసి విద్యుత్తు పంపిణీ సంస్థలు రంగంలో దిగాయి. ఇంకా మిగిలిన విద్యుత్తు ఛార్జీల బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. పలుచోట్ల పంచాయతీలకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. బకాయిలు త్వరలో చెల్లిస్తామని పంచాయతీలతో రాయించుకొని సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.

తెరపైకి ఏకకాల పరిష్కార పథకం: పంచాయతీల నుంచి విద్యుత్తు బకాయిలు పూర్తి స్థాయిలో వసూలు చేసేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు ఏకకాల పరిష్కార పథకాన్ని (ఓటీఎస్‌) తెరపైకి తెస్తున్నాయి. బకాయిలు మొత్తం ఒకేసారి చెల్లిస్తే సర్‌ఛార్జీ మినహాయిస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇదే అంశంపై విద్యుత్తు పంపిణీ సంస్థలు, పంచాయతీరాజ్‌శాఖ అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మరో రూ.1,830 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామీణ స్థానిక సంస్థలకు రాబోతున్నాయి. ఓటీఎస్‌ అమలు చేసి పంచాయతీల నుంచి రావలసిన మొత్తం బకాయిలు వసూలు చేయాలన్నది విద్యుత్తు పంపిణీ సంస్థల ఆలోచనగా తెలుస్తోంది. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ప్రధాన ఆధారంగా నిలుస్తున్న ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిల కిందే చెల్లించాల్సి వస్తే... ఇక గ్రామాల్లో పనులు చేయడం అసాధ్యమని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details