ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ - బతుకమ్మ చీరల పంపిణీ వార్తలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది నిరుపేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది. 18 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

bathukamma sarees distribution
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

By

Published : Oct 9, 2020, 8:06 AM IST

బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి 18 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా నిబంధనల మేరకు మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మహిళలు ఈ కేంద్రాల నుంచి చీరలను పొందవచ్చు. ఇళ్లవద్ద కూడా అందజేస్తారు.

మహిళలకు బతుకమ్మ కానుక, నేతన్నలకు ఉపాధి కల్పన కోసం ఉచిత చీరల పంపిణీ నాలుగేళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ ఏడాది ఇందుకు రూ. 317 కోట్లను కేటాయించగా.. సిరిసిల్లలోని వేల చేనేత కుటుంబాలు 26 వేల మగ్గాలపై ఎనిమిది నెలల వ్యవధిలో 287 డిజైన్లతో.. బంగారం, వెండి జరీ అంచులతో కోటి చీరలను తయారు చేశాయి. ఇవి మండల గోదాములకు, గ్రామాలకు గురువారం రాత్రి చేరాయి. శుక్రవారం ఉదయం నుంచే పంపిణీ చేపడతారు.మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. మహిళలు ఆహారభద్రత కార్డులను చూపి, రిజిస్టర్లపై సంతకాలు చేసి చీరలు పొందాలి. ఈ నెల 17న బతుకమ్మపండగ నాటికి పూర్తిగా చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

బతుకమ్మ చీరలకు బ్రాండింగ్‌

ప్రభుత్వ పథకం కింద తయారు చేస్తున్న బతుకమ్మ చీరలు... జనవరి తర్వాత బ్రాండింగ్‌తో బహిరంగ మార్కెట్‌లో వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి. గత వారం చీరల ప్రదర్శన సందర్భంగా మంత్రి కేటీ రామారావు ఇచ్చిన ఆదేశాల మేరకు చేనేత జౌళి శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్‌ బతుకమ్మకు సరికొత్త బ్రాండ్‌ను రూపొందిస్తున్నారు. దుకాణాలు, వస్త్ర సముదాయాల్లో కయవిక్రయాలకు వీలుగా వీటి ఉత్పత్తి, మార్కెటింగుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో మంత్రి కేటీఆర్‌ వద్ద జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి:'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'

ABOUT THE AUTHOR

...view details