ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sankranthi Special Buses: సంక్రాంతికి భారీగా ప్రత్యేక బస్సులు, రైళ్లు - సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi Special Buses 2021: పండగ ప్రయాణాలపై 50 శాతం అదనపు చార్జీలు లేకుండా.. దసరాకు నడిపినట్టే సంక్రాంతికీ నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఎప్పటిలాగే ఈ పండుగకు 4,900లకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Sankranthi Special Buses
Sankranthi Special Buses

By

Published : Dec 31, 2021, 11:24 AM IST

Sankranthi Special Buses 2021 : సంక్రాంతి పండుగకు అదనపు చార్జీలు లేకుండా బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. ఒకట్రెండ్రోజుల్లో అధికార ప్రకటన చేయనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పండుగకు ఎప్పటిలాగే 4,900లకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్​ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇలా 2.50 లక్షల సీట్లను అందుబాటులో ఉంచనుంది. ఇందులో 1600లకు పైగా బస్సులను ఏపీలోని 30 ముఖ్యపట్టణాలకు నడుపుతారు. లక్ష సీట్లకు పైగా ఆంధ్రావైపు వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్​ సౌకర్యం కల్పిస్తున్నారు.

తగ్గేదేలే అంటున్న ఏపీఎస్‌ఆర్టీసీ..

Sankranthi Special Trains : మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ దసరాకు ప్రత్యేక సర్వీసులంటూ టికెట్‌ ధరలను పెంచి బస్సులను నడిపింది. సంక్రాంతికీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు టికెట్‌ ధర ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక రైళ్లు..

Sankranthi Special Buses in Telangana : సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 9న సికింద్రాబాద్​-బెర్హంపూర్, 10న బెర్హంపూర్-సికింద్రాబాద్, జనవరి 3న సుల్లుపేట-నెల్లూర్, నెల్లూర్-సుల్లుపేట, జనవరి 3,5,7న కాకినాడ టౌన్- లింగంపల్లి, జనవరి 4,6,8న లింగంపల్లి-కాకినాడటౌన్, జనవరి 10,12,14,17న కాకినాడటౌన్-లింగంపల్లి, జనవరి 11,13,15,18న లింగంపల్లి-కాకినాడ టౌన్​కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితోపాటు శబరిమలకు జనవరి 4న, 11న కాకినాడటౌన్- ఎర్నాకులం, జనవరి 5, 12న ఎర్నాకులం- కాకినాడటౌన్​కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details