రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సచివాలయంలోని పార్కింగ్ ప్రదేశంలో ఉద్యోగులంతా కలసి ఈ సంబరాలను ప్రారంభించారు. సచివాలయ రహదారుల్లో మహిళలు రంగురంగుల రంగవల్లికల్ని వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, పులివేషాలు, కోలాటాల నడుమ సచివాలయ ప్రాంగణం పండుగ కోలాహలం నెలకొంది.
సచివాలయ మహిళా ఉద్యోగినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. ఉద్యోగులంతా సంప్రదాయ వస్త్రధారణతో ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాల కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల్ని మంజూరు చేసింది.