ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు రహదారులు, భవనాల శాఖ మంత్రిగా శంకరనారాయణ బాధ్యతల స్వీకరణ - మంత్రి శంకరనారాయణ

రహదారులు, భవనాల శాఖ మంత్రిగా శంకరనారాయణ నేడు ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరిస్తారు.

sankara narayana take responsibility as roads and buildings department minister
మంత్రి శంకర నారాయణ

By

Published : Jul 29, 2020, 9:04 AM IST

రహదారులు, భవనాల శాఖ మంత్రిగా శంకరనారాయణ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో బాధ్యతలు చేపడతారు. 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరిస్తారు.

కొత్త మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్​లు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వారికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మంత్రి శంకరనారాయణ శాఖను మార్చింది. చెల్లుబోయిన వేణుగోపాల్​కు బీసీ సంక్షేమశాఖను కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖలు అప్పగించారు. ఇక బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణకు రహదారులు, భవనాల శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ రహదారులు, భవనాల శాఖ బాధ్యతలు చూసిన ధర్మాన కృష్ణదాస్​కు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించిన సీఎం జగన్ ఆయనకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details