ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్​ వీడియో: ఏటీఎం కేంద్రంలో శానిటైజర్​ స్వాహా - bhadradri district ATM Center

ఓ వ్యక్తి సైలెంట్​గా ఏటీఎం కేంద్రానికి వచ్చాడు. కొవిడ్​ నిబంధనలు పద్దతిగా పాటించాడు. శానిటైజర్​ చేతులకు రాసుకుని డబ్బులు సైతం డ్రా చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఎంచక్కా శానిటైజర్ తీసుకుని బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినట్లు తెలిసింది.

sanitizer theft
ఏటీఎం కేంద్రంలో శానిటైజర్​ స్వాహా

By

Published : May 1, 2021, 11:09 AM IST

ఏటీఎం కేంద్రంలో శానిటైజర్​ స్వాహా

సాధారణంగా ఏటీఎంలో డబ్బులు దొంగిలించడం చూశాం. కానీ ఓ వ్యక్తి అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఏటీఎం కేంద్రానికి వచ్చిన ఆ వ్యక్తి అక్కడ ఉన్న శానిటైజర్ వినియోగించుకొని కార్డు ద్వారా డబ్బులను డ్రా చేసుకున్నాడు. కాసేపు తదేకంగా శానిటైజర్ వైపు చూసిన అతనికి ఓ ఆలోచన కలిగినట్లుంది.

ఎంతో భద్రంగా ఉన్న శానిటైజర్ బాటిల్...తన బ్యాగులో మరింత భద్రంగా ఉంటుంది అనుకున్నాడో... ఆ సీసా తీసుకుని తాను తెచ్చుకున్న బ్యాగులో పెట్టుకుని హుందాగా వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. చదువుకున్న వ్యక్తిగా కనిపిస్తున్న అతని తీరుకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినట్లు సమాచారం.

ఇదీ చూడండి: మంత్రి ఈటల భవిష్యత్తు ఏమిటి..?

ABOUT THE AUTHOR

...view details