‘‘మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం ఇప్పుడు పురోగతిలో ఉంది. మొదట్లో ఇసుక సమస్య కారణంగా దీని నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. అంతకుముందు డ్రెయిన్, రహదారి నిర్మాణం, అక్కడున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ క్యాంపస్‌ను మార్చడం లాంటి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వపరంగా కొంత ఆలస్యం జరిగింది. దీనికితోడు కొవిడ్ కూడా ప్రభావం చూపింది’’ అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు.
కడప ఎయిర్ పోర్టుపై మూడేళ్లలో రూ.26 కోట్ల నష్టం
కడప ఎయిర్‌పోర్టు నిర్వహణలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు గత మూడేళ్లలో రూ.26.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు పార్లమెంటు స్థాయీసంఘం నివేదిక పేర్కొంది. ఆర్‌సీఎస్ పథకం కింద ఉన్న దాదాపు అన్ని విమానాశ్రయాలూ నష్టాలను మూటగట్టుకుంటున్నట్లు పేర్కొంది.
రూ.19,192 కోట్ల అదనపు రుణ సేకరణకు అనుమతి
కొవిడ్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు రూ.19,192 కోట్ల అదనపు రుణ సేకరణకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
మచిలీపట్నం హార్బర్‌కు రూ.252 కోట్లతో ప్రతిపాదనలు
మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ రెండోదశ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.252 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. లోక్‌సభలో వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తమ మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసిందని, 2024 మార్చి కల్లా పనుల పూర్తికి ఏపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
నేటి నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ