తెలంగాణలోని మేడారం మహా జాతరలో రెండో రోజైన గురువారం సమ్మక్క గద్దెపై చేరింది. చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలతో గద్దెపైకి చేర్చారు గిరిజన పూజారులు. ఇందుకు గౌరవ సూచకంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గుట్ట దిగువన గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క వచ్చే దారిని రంగవల్లులతో తీర్చిదిద్దారు. నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజును గద్దె వద్దకు చేరగా... నేడు సమ్మక్క రాకతో వనదేవతలందరూ భక్తులకు దర్శనమిచ్చారు. రేపు జాతరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించనున్నారు.
సమ్మక్క గద్దెపై చేరంగా.... భక్తజనం మురవంగా...
తెలంగాణ రాష్ట్రం మేడారం మహా జాతరలో భాగంగా రెండో రోజు సమ్మక్క తల్లి.. గద్దెపైకి చేరింది. అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి సంప్రదాయ నృత్యాల మధ్య తీసుకొచ్చారు. అంతకుముందు చిలుకలగుట్ట దిగువన గౌరవసూచకంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్... గాల్లో కాల్పులు జరిపారు.
సమ్మక్క గద్దెపై చేరంగా.... భక్తజనం మురవంగా...
ఇదీ చదవండి:
మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!