కరోనా వైరస్ కట్టడికి తమ వద్ద మందులు ఉన్నాయంటూ కొందరు కేటుగాళ్లు అక్రమాలకు తెరలేపారు. తెలంగాణలో కోవిడ్ అభయ పేరిట నకిలీ ఔషధాలు తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సొంటి, అల్లం తదితర మిశ్రమాలతో చూర్ణం తయారు చేసి... రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ సోకకుండా ఉంటుందని గోడ పత్రికల ద్వారా ముఠా సభ్యులు విస్తృత ప్రచారం చేశారు. ఆన్‌లైన్ ద్వారా చూర్ణం డబ్బాలను విక్రయించారు. ఒక్కో డబ్బాను రూ.280 చొప్పున అమ్మారు.
బత్తిని సోదరుల పేరిట..
చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని సోదరుల పేరిట ముఠా ఈ ఆగడాలకు పాల్పడింది. అయితే ఈ విషయం బత్తిని కుటుంబ సభ్యుల దృష్టికి రావడం వల్ల అసలు విషయం బయటకొచ్చింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.