ముఖ్యమంత్రి జగన్పై తెలుగుదేశం పార్టీ నేతలు బూతులు తిట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. చంద్రబాబునాయుడు చేస్తోన్న దీక్ష ఓ డ్రామా అని.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు.
SAJJALA COMMENTS: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: సజ్జల - ycp leader sajjala latest news
ముఖ్యమంత్రి జగన్పై తెలుగు దేశం పార్టీ నేతలు బూతులు తిట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు.
సజ్జల
తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంటే ఆయనకు.. ఆ పార్టీకి మంచిదన్నారు. గంజాయి సమస్య చంద్రబాబు హయాం నుంచీ ఎక్కువగా ఉందన్న సజ్జల.. గంజాయి నివారణకు సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు 2.50 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారన్నారు. రాజకీయపార్టీగా ఉండే అర్హత తెలుగుదేశం పార్టీ కి లేదన్న ఆయన.. రాజకీయ పార్టీ ఇలా బూతులు మాట్లాడటంపై అన్ని వర్గాల్లో విస్తృత చర్చ జరగాలన్నారు.