ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SAJJALA ON PRC : ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే.. ఉద్యోగులకే నష్టం : సజ్జల

Sajjala on PRC : ఉద్యోగుల పీఆర్సీపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్న ఆయన.. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేస్తే ఉద్యోగులకే నష్టమని అన్నారు.

By

Published : Dec 10, 2021, 7:48 PM IST

Published : Dec 10, 2021, 7:48 PM IST

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala on PRC, OTS : ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే.. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేస్తే మాత్రం.. ఉద్యోగులకే నష్టమని అన్నారు. పీఆర్​సీ ప్రక్రియ వారంలోపే పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పిన సజ్జల.. సీపీఎస్ రద్దుపై కమిటీల అధ్యయనం నెల రోజుల్లో పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ పథకంపైనా సజ్జల స్పందించారు. ఓటీఎస్ పూర్తి స్వచ్ఛందమని చెప్పారు. ప్రభుత్వం.. ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తోందన్న సజ్జల.. రూ.15 లక్షల విలువైన ఇంటిని పేదలకు ఇస్తున్నామన్నారు. ఓటీఎస్​తో లబ్ధిదారులపై రూ.4 వేల కోట్లే భారం పడుతోందని వెల్లడించారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం వల్ల ఉద్యోగులకే నష్టం. ఓటీఎస్ పూర్తిగా స్వచ్చందం. ప్రభుత్వం ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తోంది.

-సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details