ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP,TS Water Disputes: సీమ కష్టాలు తెలుసని గతంలో కేసీఆర్ చెప్పారు: సజ్జల - KRMB news

రాయలసీమ ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ ప్రయత్నాన్ని గతంలో కేసీఆర్ అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ (cm kcr) చెప్పారని సజ్జల గుర్తు చేశారు.

AP-TS Water Disputes
sajjala ramakrishna reddy

By

Published : Jul 2, 2021, 3:54 PM IST


జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధానికి సీఎం జగన్ (cm jagan) లేఖ రాశారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. జగన్‌ ప్రయత్నాన్ని గతంలో కేసీఆర్ అంగీకరించి ప్రోత్సహించారని గుర్తు చేశారు.

రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నేనూ ఉన్నా. సీమ కష్టాలు తెలుసని, పరిష్కరించుకుందామని కేసీఆర్ చెప్పారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలన్నారు. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

ప్రధానికి సీఎం జగన్ లేఖ.. ఏముందంటే..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ..ప్రధాని మోదీ (PM MODI) కి, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ (Gajendra Singh Shekhawat)కు సీఎం జగన్ (cm jagan) వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని జగన్.. లేఖలో ఫిర్యాదు చేశారు. నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్‌ ఆక్షేపించారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని.., శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని జగన్‌ ప్రధానిని కోరారు. నీటి వినియోగం, పంపకాల విషయంలో కేఆర్‌ఎంబీ (KRMB) పరిధిని నిర్దేశించాలని విన్నవించారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీ (Krishna River Management Board)కి రాసిన లేఖలను కూడా జగన్ జతపరిచారు.

ఇదీ చదవండి:

AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా

CM Letter To PM: 'ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details