ప్రస్తుతం 17మంది తెదేపా ఎమ్మెల్యేలు వైకాపాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యీలు కూడా కొందరు వైకాపాలోకి చేరేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. అయితే వీరిందని తామేం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా ఎమ్మెల్సీల కోసం ప్రలోభాలకు గురి చేస్తున్నామన్న తేదేపా ప్రచారం సహా పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము ఎవరినీ ప్రలోభాలకు గురి చేయలేదన్నారు. మండలితో అనవసర రాజకీయాలు, చికాకులు తప్ప లాభం లేదన్న సజ్జల..... తెదేపా సభ్యుల వ్యవహారశైలి చూసే మండలి రద్దు చేయాలనే ఆలోచన సీఎంకు వచ్చిందని స్పష్టం చేశారు. కీలక నిర్ణయం తీసుకునే ముందు మేధావుల సలహాలు, సూచనలు తీసుకునేందుకే కొంత గడువు ఇచ్చామని వివరించారు. ప్రజాస్వామ్యయుతంగా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. తమ నిర్ణయం సరైనదో కాదో వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబుతారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
'వైకాపాలోకి చేరేందుకు సిద్ధంగా 17మంది ఎమ్మెల్యేలు'
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపాలోకి చేరేందుకు తెదేపా నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే వీరిందని తామేం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
sajjala ramakrishna reddy