Sajjala Comments: వారిని రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదు: సజ్జల - Sajjala On Employees Protest
15:27 February 04
చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారమవుతాయి: సజ్జల
Sajjala On Employees Protest :ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. వారి తదుపరి కార్యాచరణ ఏంటో తెలియదన్న సజ్జల.. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని.. అలాంటప్పుడు వారు ఎవరిపై ఒత్తిడి తెస్తారని వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు చేరితే పరిస్థితి చేయి దాటుతుంది.ఉద్యోగులకు ఇచ్చిన అవకాశాలను వదులుకుంటున్నారు. కొవిడ్ వేళ భారీ సామూహిక కార్యక్రమాలు సరికాదు. ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు కూడా చేరాయి. ఉద్యోగుల ఉద్యమానికి పార్టీలను స్వాగతిస్తామంటున్నారు. పార్టీలు చేరితే ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఉద్యోగులే బదిలీలు కోరుతున్నారు.. అలాంటప్పుడు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ ఎందుకు ఆపుతుంది. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? సమ్మె నోటీసు ఇచ్చామని.. ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దంటే ఎలా ? అత్యవసర సేవలు ఆపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇదీ చదవండి