మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమాల మాటల యుద్ధంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పరుషంగా లేదా ఇంకోరకంగా మాట్లాడిన సరైంది కాదన్నారు. అవతలవారికి ఎంత చెప్పినా వినకుండా అబద్ధాలు ప్రచారం చేస్తుండటంతో ఆవేశంలో ఇలా ముతక భాషలో కొడాలి నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారన్నారు. అంతేగానీ ఈయన వెళ్లి కొట్టేది లేదని .. ఆయన వచ్చి డొక్క తీసేది ఉండదని తెలిపారు. రాజకీయంగా తెదేపా వారు వాడుతున్న భాష కూడా సరిగా లేదన్న సజ్జల... ఇలాంటి భాషకు ఆ పార్టీనే బాధ్యత వహించాలన్నారు.
పరుషంగా ఎవరు మాట్లాడిన సరైంది కాదు: సజ్జల - sajjala ramakrishna reddy on jagan delhi tour
ఎవరు పరుషంగా మాట్లాడిన, ఇంకోరకంగా మాట్లాడిన సరైంది కాదని వైకాపా ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమ మధ్య వివాదాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తెదేపా వారు వాడుతున్న భాష సరిగా లేదని.. దానికి ఆ పార్టీనే బాధ్యత వహించాలన్నారు. సీఎం జగన్ దిల్లీ పర్యటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
హైకోర్టులో కిలారి రాజేష్ అంశం చాలా చిన్నదని సజ్జల వ్యాఖ్యానించారు. అమరావతి భూముల వ్యవహారం సీబీఐకి ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో ఇంకా చాలా ఉందని... దర్యాప్తులో కచ్చితంగా వాళ్ల తప్పులు దొరుకుతాయన్నారు. ప్రధానంగా కేంద్రంతో రాష్ట్రంకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై మాట్లాడటానికే సీఎం జగన్ దిల్లీ వెళ్లారని ఇందులో రాజకీయం ఏమీ లేదన్నారు.
ఇదీ చదవండి:మంత్రి కొడాలి నాని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు: దేవినేని