ఎంపీపీ ఎన్నికల్లో(ap parishad elections results) కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy on parishad elections news). పరిషత్ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ పార్టీలోనైనా స్థానిక నాయకత్వం కోసం పోటీ సహజమే అని వ్యాఖ్యానించారు. ఎంపీపీ ఎన్నికల్లో వైకాపా గెలవొద్దని జనసేన, తెదేపా ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్(bharat bandh news)పై వైకాపా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మద్దతుపై ముఖ్యమంత్రి(cm jagan )తో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ గురించి మాట్లాడతారా?