ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

sajjala: "వచ్చే ఎన్నికల్లో పొత్తులపై... ఎలాంటి చర్చ జరగలేదు" - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. జులైలో ప్లీనరీ తర్వాత మరోసారి సమావేశం ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.

State Government Advisor Sajjala Ramakrishna Reddy
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

By

Published : Apr 27, 2022, 8:04 PM IST

పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం ఆదేశించారని తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పారన్నారు. మంత్రులు, పార్టీ అధ్యక్షులు సమన్వయంతో సాగాలని సూచించినట్లు చెప్పారు. మే 10నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'గడప గడపకు వైకాపా' కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్​ ఆదేశించినట్లు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇకపై ప్రతి మూణ్నెళ్లకోసారి మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సీఎం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. జులైలో ప్లీనరీ తర్వాత మరోసారి సమావేశం ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పార్టీ నేతలతో సీఎం జగన్​ భేటీ... పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details