Sajjala On Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు, ముందస్తు ఎన్నికలకు ఎందుకెళ్తామని అన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామన్న ఆయన.. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. కేంద్రం నుంచి ఆదేశాలుంటే (జమిలీ ఎన్నికలు) తప్ప ముందస్తు ఎన్నికలు ఉండబోవని సజ్జల తేల్చి చెప్పారు.
Sajjala On Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు: సజ్జల - ఏపీలో ముందస్తు ఎన్నికలు
16:59 January 05
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి: సజ్జల
ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం అప్పులు తెస్తోందని పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు 1.21 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై చర్యలు తీసుకున్నామని.. రాష్ట్రంలో ఎక్కడా విధ్వంసం జరగడం లేదని వ్యాఖ్యానించారు.
"ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు, ముందస్తు ఎన్నికలకు ఎందుకెళ్తాం? ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. కేంద్రం నుంచి ఆదేశాలుంటే తప్ప ముందస్తు ఎన్నికలు ఉండవు" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇదీ చదవండి:
షర్మిలమ్మ మా వైఎస్ కుటుంబ సభ్యురాలు.. మేమంతా ఒక్కటే: మంత్రి బాలినేని