అమరావతిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెబుతోన్న మాటలపై అంత నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న తెదేపా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలు ఎటు వైపు ఉన్నారో తేలుతుందన్నారు.
అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: సజ్జల - జనభేరి సభలో చంద్రబాబు ప్రసంగం
రాజధానిపై రెఫరెండంకు సిద్ధమా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్పందించారు. చంద్రబాబుకు అంత నమ్మకం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ట్వీట్ చేశారు.
![అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: సజ్జల sajjala-ramakrishna-reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9926895-568-9926895-1608304177715.jpg)
sajjala-ramakrishna-reddy