'ప్రధాని మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం' - Sajjala Rama Krishna Reddy comments on kodali nani
ప్రధాని మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మోదీ గురించి పార్టీలో ఎవరైనాసరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని సజ్జల సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. మోదీ దేశానికి ప్రధాని... ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని సజ్జల హితవుపలికారు. మోదీ గురించి పార్టీలో ఎవరైనాసరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని సజ్జల స్పష్టం చేశారు. పార్టీ నేతలు సంయమనం పాటించాలని సూచించారు. వ్యాఖ్యలపై కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని అనుకుంటున్నానని సజ్జల పేర్కొన్నారు.