Sajjala on MP Gorantla issue: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై సస్పెన్షన్ వేటు వేయవచ్చని లేదా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని వైకాపా వర్గాలు తెలిపాయి. ఎంపీ వ్యవహారంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న సీఎం ఎంపీపై తదుపరి చర్యలకు ఉపక్రమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సీఎం గురువారం రెండుసార్లు పిలిపించి దీనిపై మాట్లాడినట్లు సమాచారం. సీఎంతో భేటీ తర్వాత సజ్జల.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘ఎంపీని వివరణ కోరితే దాన్ని ఆయన ఖండించారు. వీడియోపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. చట్టపరమైన విచారణ జరుగుతుంది. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఎంపీపై కఠినాతికఠినమైన చర్య తీసుకుంటాం. ఇలాంటి వ్యవహారంపై రాజకీయ పార్టీగా ఎలా స్పందించాలనేదానిపై ఒక ఉదాహరణను సెట్ చేసేలా చర్య ఉంటుంది’ అని ప్రకటించారు.
మార్ఫింగ్ లేదని తేలితే.. అత్యంత కఠిన చర్యలు: సజ్జల - ఏపీ తాజా వార్తలు
SAJJALA: ఎంపీ గోరంట్ల మాధవ్.. నగ్న వీడియోలో ఎలాంటి మార్ఫింగ్ లేదని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే పార్టీ సహించబోదన్నారు.
SAJJALA
Last Updated : Aug 5, 2022, 7:00 AM IST