ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాన్నగారు వేలాది రైతుల హృదయాల్లో స్థానం సంపాదించారు' - sailaja kiran on Sundara Naidu Demise

Uppalapati Sundara Naidu Demise: ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్‌ దంపతులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. సుందరనాయుడు భౌతికదేహాన్ని సందర్శించేందుకు బంధువులు, శ్రేయాభిలాషులు, అభిమానులు ఆసుపత్రి వద్దకు తరలివస్తున్నారు. సుందరనాయుడు లేని లోటు తీర్చలేనిదని ఆయన కుమార్తె, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజాకిరణ్ అన్నారు.

sailaja kiran on  Sundara Naidu Demise
పారిశ్రామికవేత్త సుందరనాయుడు మృతిపట్ల శైలజ కిరణ్​ సంతాపం

By

Published : Apr 28, 2022, 10:42 PM IST

Updated : Apr 29, 2022, 1:39 PM IST

'నాన్నగారు వేలాది రైతుల హృదయాల్లో స్థానం సంపాదించారు'

Uppalapati Sundara Naidu Demise: ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్‌ లిమిటెడ్ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడు లేని లోటు తీర్చలేనిదని ఆయన కుమార్తె, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజాకిరణ్ అన్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మొదటిసారి అప్పట్లో సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారని గుర్తుచేశారు. తమ ఫామ్‌లో సేంద్రియ వ్యవసాయం, కోడిగుడ్ల ఉత్పత్తి, లభ్యత చూసిన ఎంతో మంది రైతులు స్ఫూర్తి పొందారని తెలిపారు.

ఆ స్ఫూర్తితో చిత్తూరు, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. అనేక మంది చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులు ఉన్నత స్థాయిలోకి వచ్చారని తెలిపారు. తమ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించుకుని చాలా మంది అమెరికాలో స్థిరపడ్డారని చెప్పుకొచ్చారు. వారందరికి సుందరనాయుడు ఎంతో ప్రేమ, అభిమానంతో ఉంటారని చెప్పారు. నిరంతరం పౌల్ట్రీ రైతులు బాగుండాలని... గుడ్లు, చికెన్ ధరలు బాగుండాలని పౌల్ట్రీ పరిశ్రమ రంగం అభివృద్ధి కోసమే ఆయన తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తమతో పాటు వేలాది రైతు కుటుంబాలకు కూడా తీరని లోటన్నారు. అంతమంది రైతుల హృదయాల్లో స్థానం సంపాదించడం మాకు చాలా గర్వకారణంగా ఉందని శైలజాకిరణ్ పేర్కొన్నారు.

'చిత్తూరు జిల్లాలో మొదటిసారి అప్పట్లో సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారు. తమ ఫామ్‌లో సేంద్రియ వ్యవసాయం, కోడిగుడ్ల ఉత్పత్తి, లభ్యత చూసిన ఎంతో మంది రైతులు స్ఫూర్తి పొందారు. ఆ స్ఫూర్తితో చిత్తూరు, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో చాలా అభివృద్ధి జరిగింది. అనేక మంది చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులు ఉన్నత స్థాయిలోకి వచ్చారు. నాన్నగారు వేలాది మంది రైతుల గుండెల్లో స్థానం సంపాదించారు.' - సీహెచ్ శైలజాకిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్

ఇదీ చూడండి:

Last Updated : Apr 29, 2022, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details