SAI DHARAM TEJ: సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ - ఏపీ న్యూస్
13:54 September 12
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న అపోలో వైద్యులు
రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు సాయిధరమ్ తేజ్ గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఈ రోజు మధ్యాహ్నం తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని చెప్పారు. కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సాయి తేజ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.